, హైదరాబాద్: నగరంలోని గ్రామా శివారులో దారుణ ఘటన చోటుకుంది. ఓ 50 ఏళ్ల మహిళా మెడ నరికి దుండగులు హత్య చేసిన ఘటన హాయాత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. కుంట్లుర్ గ్రామ శివారులో మొండం లేని మహిళా మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు హాయత్‌నగర్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే క్లూస్ టీం, డాగ్ స్కాడ్ బృందంతో డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంఘన స్థలాన్ని పరిశీలించిన డీసీపీ..ఈ హత్య రెండు రోజుల క్రితం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే మృతిచెందిన మహిళ మెదక్ జిల్లా జోగిపెట మండలం యారరం గ్రామానికి చెందిన బెతమ్మ(50)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు మీడియాకు తెలిపారు.
మహిళా మెడ నరికి హత్య చేసిన దుండగులు